Liquor Sales : విజయ దశమికి ముందున్న నవరాత్రి కాలంలో, తెలంగాణ ఎక్సైజ్ శాఖ మద్యం అమ్మకాలు జోరుగా సాగి, పది రోజుల్లోనే రూ. 1,000 కోట్ల మార్కును అధిగమించింది. మొత్తం వసూళ్లు రూ.1,057 కోట్లకు చేరాయి. ఒక్క బీర్ అమ్మకాలతో 18 లక్షల కేసులు నమోదయ్యాయి. మొత్తం ఆదాయం గణనీయంగా పెరిగింది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2024-25), మద్యం అమ్మకాల ద్వారా రాష్ట్రం ₹19,857 కోట్లను ఆర్జించింది. టైమ్స్ ఆఫ్ ఇండియా డేటా ప్రకారం , ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ (IMFL) 10.45 లక్షల కేసులు అమ్ముడయ్యాయి. అక్టోబర్ 1- 11 మధ్య మద్యం అమ్మకాల ద్వారా ఈ సంవత్సరం ఆదాయం రూ. 877 కోట్లకు చేరుకుంది. ఇది గత సంవత్సరం (2023-24) ఇదే కాలంతో పోలిస్తే 20 శాతం పెరుగుదలను ప్రతిబింబిస్తుంది. అక్టోబరు 2 (గాంధీ జయంతి) న డ్రై డేగా కూడా పాటించారు.
గత ఏడాది ఇదే కాలపరిమితితో పోలిస్తే బీర్ విక్రయాలు 10 శాతం పెరగగా, IMFL అమ్మకాలు 26 శాతం పెరిగాయి. తెలంగాణలో మద్యం అమ్మకాలు స్థిరమైన వార్షిక వృద్ధిని కనబరుస్తున్నాయి. 2014-15 ఆర్థిక సంవత్సరంలో కేవలం రూ. 10,000 కోట్ల నుండి 2023-24 నాటికి రూ. 36,493 కోట్లకు చేరుకుంది.