ఈ ఫిబ్రవరిలో టాటా ఈవీ కార్లలో అత్యధిక డిస్కౌంట్ పొందుతున్న మోడల్ టాటా కర్వ్ ఈవీ (Curvv EV). ఈ కారుపై గరిష్టంగా రూ. 3.8 లక్షల వరకు తగ్గింపు లభిస్తోంది. ముఖ్యంగా క్రియేటివ్ 45 వేరియంట్‌కు సంబంధించిన MY24, MY25 మోడళ్లపై రూ. 3.3 లక్షల డిస్కౌంట్ ఉండగా, MY26 మోడళ్లపై రూ. 2.8 లక్షల వరకు తగ్గింపు అందిస్తున్నారు. ఇతర వేరియంట్లలో కూడా ఆఫర్లు ఉండటంతో కొనుగోలుదారులు మంచి ఆదా చేసుకునే అవకాశం ఉంది.
ఇక టాటా పంచ్ ఈవీ (Punch EV) విషయానికి వస్తే, ఫిబ్రవరి 20న పంచ్ ఈవీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్‌కు సిద్ధమవుతున్న నేపథ్యంలో ప్రస్తుత మోడళ్లపై భారీ ఆఫర్లు ప్రకటించింది. MY24, MY25 మోడళ్లపై రూ. 1.6 లక్షల వరకు డిస్కౌంట్ లభిస్తుండగా, కొత్త MY26 వేరియంట్లపై రూ. 90,000 వరకు తగ్గింపు ఉంది.
టాటా నెక్సాన్ ఈవీ (Nexon EV)పై కూడా మంచి ఆఫర్లు ఉన్నాయి. ఈ ప్రజాదరణ పొందిన మోడల్‌పై పాత స్టాక్‌కు రూ. 1.2 లక్షల వరకు డిస్కౌంట్ ఉండగా, MY26 మోడళ్లపై రూ. 30,000 వరకు తగ్గింపు అందిస్తున్నారు. టాటా టియాగో ఈవీ (Tiago EV) విషయానికి వస్తే, ఇది టాటా అందిస్తున్న బడ్జెట్ ఎలక్ట్రిక్ కారు. పాత మోడళ్లపై రూ. 1.5 లక్షల వరకు, కొత్త మోడళ్లపై రూ. 60,000 వరకు డిస్కౌంట్ లభిస్తోంది.
టాటా ఫ్లాగ్‌షిప్ ఎలక్ట్రిక్ కారు అయిన హారియర్ ఈవీ (Harrier EV)పై కూడా యూనిఫాంగా రూ. 1.5 లక్షల డిస్కౌంట్ అందిస్తున్నారు. MY26 మోడళ్లలో లోయల్టీ బోనస్ వర్తించే ఏకైక ఈవీ ఇదే కావడం విశేషం.
పెట్రోల్, డీజిల్ ఖర్చుల భారాన్ని తగ్గించుకుని, భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఎలక్ట్రిక్ కారు కొనాలనుకునేవారికి ఈ ఫిబ్రవరి నెల మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు. అయితే వేరియంట్, స్టాక్‌ను బట్టి ఆఫర్లు మారే అవకాశం ఉన్నందున, ఖచ్చితమైన వివరాల కోసం మీ సమీప టాటా డీలర్‌ను సంప్రదించడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.