StarLink: శాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్ సేవల సంస్థ స్టార్‌లింక్ త్వరలో భారత్‌లో ప్రారంభంకాబోతుంది. ఇందుకు దేశవ్యాప్తంగా 9 ప్రధాన నగరాల్లో ఎర్త్ స్టేషన్ల ఏర్పాటుకు సన్నాహకాలు జరుగుతున్నాయి. ఈ నగరాల్లో ముంబై, నోయిడా, చండీఘర్, హైదరాబాద్, కోల్‌కతా, లక్నో లాంటి ప్రధాన నగరాలు ఉన్నాయి. హైదరాబాద్‌లో కూడా ఈ ఎర్త్ స్టేషన్ ఏర్పాటుచేసే అవకాశం ఉంది. ఈ ఏడాది చివరి వరకు లేదా 2026లో భారత్‌లో స్టార్‌లింక్ సేవలు ప్రారంభం కానున్నాయి.
స్టార్‌లింక్ అసలు ఏమిటి?
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కంపెనీ రూపొందించిన స్టార్‌లింక్, భూకోణంలోని ప్రతి ఇంటికి శాటిలైట్ ద్వారా హై-స్పీడ్ ఇంటర్నెట్ అందించేందుకు రూపకల్పన చేశారు. లో ఎర్త్ ఆర్బిట్ (LEO) శాటిలైట్‌లను ఉపయోగించి, సాధారణ ఇంటర్నెట్ కంటే వేగవంతమైన డేటా కనెక్షన్ అందుతుంది. ఉపగ్రహ ఇంటర్నెట్ ద్వారా ఎలాంటి అడ్డంకులు లేకుండా నేరుగా కనెక్ట్ అవ్వడం వల్ల తక్కువ లేటెన్సీ, వేగవంతమైన డేటా లభిస్తుంది.
డేటా స్పీడ్:
-
డౌన్‌లోడ్: 50 Mbps నుంచి 250 Mbps
-
అప్‌లోడ్: సుమారుగా 40 Mbps
-
ప్రీమియం ప్యాకేజీలు: 500 Mbps
ప్రయోజనాలు:
-
భూమికి 550 కిమీ ఎత్తులో ఉండే LEO శాటిలైట్‌లు
-
తక్కువ లేటెన్సీతో వేగవంతమైన ఇంటర్నెట్
-
మారుమూల గ్రామాలు, పర్వత ప్రాంతాలవరకు ఇంటర్నెట్ అందుబాటులోకి తీసుకురావడం
ఇప్పటివరకు 100కు పైగా దేశాల్లో స్టార్‌లింక్ సేవలు అందుబాటులో ఉన్నాయి. భారతదేశంలో ఈ సేవలు ప్రారంభమవ్వడంతో, సాంప్రదాయ ఇంటర్నెట్‌కు ప్రత్యామ్నాయం ఏర్పడతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
