Gold Price: బంగారం ధరలు ఈ రేంజ్ లో తగ్గడం ఇదే ఫస్ట్ టైమా..?

Gold Rate Today (26 January 2026), Gold Price in India

Gold Rate Today (26 January 2026), Gold Price in India

Gold Price: బంగారం, వెండి రేట్లు ప్రస్తుతం సామాన్యుడికి అందనంతగా పెరుగుతూ భగ్గుమంటున్నాయి. రోజురోజుకూ బంగారం ధరలు కొత్త రికార్డుల దిశగా దూసుకుపోవడంతో సాధారణ ప్రజలు కొనాలంటే ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంతర్జాతీయ మార్కెట్ ఉద్రిక్తతలు, ప్రపంచ ఆర్ధిక పరిణామాలు వంటి అంశాల ప్రభావంతో దేశంలోనూ బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని హైదరాబాద్‌, విజయవాడ వంటి నగరాల్లో పసిడి రేట్లు ఆకాశాన్ని తాకుతున్నాయి.

గతంలో స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు ఇప్పుడు మాత్రం వేల్లోనే మార్పులు నమోదు చేస్తున్నాయి. అయితే జనవరి 26 నాటికి దేశీయంగా బంగారం, వెండి ధరలు తేలికగా తగ్గుముఖం పట్టాయి. ఈ తగ్గుదల చూసి వినియోగదారులు ‘ఇదేనా తగ్గిందని చెప్పేది?’ అని ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే పెరిగినప్పుడు వేల్లో పెరుగుతోంటే, తగ్గినప్పుడు మాత్రం పదుల రూపాయల్లో మాత్రమే తగ్గటం కొంత గమ్మత్తుగా కనిపిస్తోంది. ప్రస్తుతం తులం బంగారం ధర కేవలం 10 రూపాయలు తగ్గడం కూడా ఇదే ఉదాహరణ.

దేశీయ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,60,250 కాగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,46,890 వద్ద ఉంది. వెండి విషయానికొస్తే కిలోకు రూ.100 తగ్గి రూ.3,34,900 వద్ద ట్రేడ్ అవుతోంది. అయితే హైదరాబాద్‌లో వెండి ధర ఎక్కువగా ఉండి కిలోకు రూ.3,64,900గా ఉంది.

అదే రోజు ప్రధాన నగరాల్లో ధరలు ఇలా ఉన్నాయి:

హైదరాబాద్‌ – 24 క్యారెట్లు: ₹1,60,250 / 22 క్యారెట్లు: ₹1,46,890
విజయవాడ – 24 క్యారెట్లు: ₹1,60,250 / 22 క్యారెట్లు: ₹1,46,890
ఢిల్లీ – 24 క్యారెట్లు: ₹1,60,400 / 22 క్యారెట్లు: ₹1,47,040
ముంబై – 24 క్యారెట్లు: ₹1,60,250 / 22 క్యారెట్లు: ₹1,46,890
చెన్నై – 24 క్యారెట్లు: ₹1,59,480 / 22 క్యారెట్లు: ₹1,47,490
బెంగళూరు – 24 క్యారెట్లు: ₹1,60,250 / 22 క్యారెట్లు: ₹1,46,890

దేశవ్యాప్తంగా ఒకే బంగారం ధర ఉండదు. ప్రతి నగరంలో పన్నులు, తయారీ ఛార్జీలు, సరఫరా పరిస్థితులు వంటి అంశాల వలన ధరలు మారుతూ ఉంటాయి. ముఖ్యంగా చెన్నైలో బంగారం ధరల్లో మార్పులు వేగంగా నమోదు అవుతుండగా, వెండి ధరలు హైదరాబాద్‌, చెన్నై, కేరళల్లో ఇతర ప్రాంతాల కంటే ఎక్కువగా ఉంటాయి.

ఈ ధరలు ఉదయం 6 గంటల సమయంలో నమోదైనవి మాత్రమే. రోజులో ఇవి మళ్లీ పెరగవచ్చు, తగ్గవచ్చు లేదా స్థిరంగా ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు.

Also Read: BCCI: బీసీసీఐ మాజీ అధ్యక్షుడు కన్నుమూత

Gold Price: బంగారం ధరలు ఈ రేంజ్ లో తగ్గడం ఇదే ఫస్ట్ టైమా..?