Gold Rates: హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు ఒక్కసారిగా పెరిగి వినియోగదారులకు భారీ షాక్ ఇచ్చాయి. ఇటీవల కొంత స్థిరంగా ఉన్న ధరలు, ఇవాళ ఒక్కరోజులోనే గణనీయంగా ఎగబాకాయి. అంతర్జాతీయ మార్కెట్ ధోరణులు, డాలర్ మారకం విలువ, భౌగోళిక రాజకీయ పరిస్థితులు వంటి అంశాల ప్రభావంతో పసిడి ధరలు ఒక్కసారిగా దూసుకెళ్లినట్లు వ్యాపార వర్గాలు చెబుతున్నాయి.
ఇవాళ హైదరాబాద్ మార్కెట్‌లో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర ఏకంగా రూ.6,600 పెరిగి రూ.1,60,530కి చేరింది. ఇది ఇప్పటివరకు నమోదైన అత్యధిక ధరలలో ఒకటిగా బులియన్ మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. అలాగే ఆభరణాల తయారికి ఎక్కువగా ఉపయోగించే 22 క్యారెట్ల బంగారం ధర కూడా భారీగా పెరిగింది. 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.6,050 పెరిగి రూ.1,47,150గా నమోదైంది.
ఈ స్థాయిలో ధరలు పెరగడంతో సాధారణ వినియోగదారులు, ముఖ్యంగా పెళ్లిళ్లు, శుభకార్యాల కోసం బంగారం కొనాలనుకున్న వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పెట్టుబడిదారులు మాత్రం బంగారాన్ని సురక్షిత పెట్టుబడిగా భావిస్తూ ఆసక్తి చూపుతున్నారు. రాబోయే రోజుల్లో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని కొందరు నిపుణులు అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో పరిస్థితులు మారితేనే ధరల్లో కొంత ఉపశమనం లభించే అవకాశం ఉందని వారు సూచిస్తున్నారు.
Also Read: Plane Crash: ఎయిర్ పోర్టులో రెండు విమానాలు ఢీ
Gold Rates: మళ్లీ షాకిచ్చిన బంగారం ధరలు
