Gold Rates: దీపావళి పండుగ సమీపిస్తుండటంతో బంగారం, వెండి ధరలు మరింత పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఈ రోజు ధరల్లో భారీ ఎగబాకుడు నమోదైంది. 24 క్యారెట్ల బంగారం ధర ఏకంగా రూ.3,280 పెరిగి, 10 గ్రాములకు రూ.1,28,680కు చేరింది. గత పది రోజుల్లోనే బంగారం ధర రూ.9,280 పెరగడం గమనార్హం.
22 క్యారెట్ల బంగారం కూడా గణనీయంగా పెరిగింది. ఈ రోజు 10 గ్రాముల ధర రూ.3,000 ఎగబాకి రూ.1,17,950గా ఉంది. దీంతో బంగారం కొనుగోలుదారులు కొంత వెనుకంజ వేస్తున్నప్పటికీ, పండుగ సీజన్ కావడంతో డిమాండ్ మాత్రం తగ్గలేదు. జ్యువెలరీ షాపులు ఆఫర్లతో కస్టమర్లను ఆకర్షించే ప్రయత్నంలో ఉన్నాయి.
ఇక వెండి ధరలు కూడా రికార్డు స్థాయిలో పెరిగాయి. కిలో వెండి ధర రూ.9,000 పెరిగి తొలిసారిగా రూ.2,06,000కు చేరింది. ఇది వెండి మార్కెట్‌లో ఇప్పటివరకు నమోదైన అత్యధిక ధరగా భావిస్తున్నారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా దాదాపు ఇదే రేట్లు కొనసాగుతున్నాయి. పండుగ సీజన్, అంతర్జాతీయ మార్కెట్‌లో ధరల మార్పులు, రూపాయి విలువలో తేడాలు – ఇవన్నీ బంగారం, వెండి ధరల పెరుగుదలకు ప్రధాన కారణాలుగా నిపుణులు చెబుతున్నారు.
