Gold Rates: ఆదివారం బంగారం రేట్లు ఎటువంటి మార్పులు లేకుండా స్థిరంగా కొనసాగుతున్నాయి. ఇటీవల రోజులుగా బంగారం ధరలు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో కొనుగోలుదారులు ఆందోళన చెందారు. గత వారం రోజుల్లోనే బంగారం ధరలు రూ.3,000కు పైగా పెరగడం వల్ల మార్కెట్‌లో కొనుగోలు తగ్గింది. అయితే ఆదివారం ధరలు స్థిరంగా ఉండడంతో వినియోగదారులకు కొంత ఊరట లభించింది. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలతో పాటు ముఖ్య నగరాల్లో బంగారం మరియు వెండి రేట్లు ఎలా ఉన్నాయో చూద్దాం.
బంగారం ధరలు
హైదరాబాద్:
10 గ్రాముల 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ ధర రూ.1,43,780 వద్ద కొనసాగగా, 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.1,31,800 వద్ద నిలిచింది.
విజయవాడ – విశాఖపట్నం:
ఇక్కడ కూడా 24 క్యారెట్ల బంగారం రూ.1,43,780, 22 క్యారెట్ల బంగారం రూ.1,31,800 వద్ద స్థిరంగా ఉన్నాయి.
చెన్నై:
10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.1,44,870 వద్ద కొనసాగగా, 22 క్యారెట్ల రేటు రూ.1,32,800గా ఉంది. ఈ ధరలు శనివారం కూడా ఇదే స్థాయిలో ఉండటం గమనార్హం.
బెంగళూరు:
24 క్యారెట్ల బంగారం రూ.1,43,780, 22 క్యారెట్ల బంగారం రూ.1,31,800 వద్ద కొనసాగాయి. శనివారం కూడా ఇదే ధరలు నమోదయ్యాయి.
ఢిల్లీ:
10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.1,43,930 వద్ద కొనసాగింది. 22 క్యారెట్ల రేటు రూ.1,31,950గా ఉంది. నిన్న కూడా ఇదే ధరలు నమోదయ్యాయి.
వెండి ధరలు
వెండి ధరలు కూడా భారీ స్థాయికి చేరుకున్నాయి. కిలో వెండి మూడు లక్షల మార్క్‌ను దాటింది.
హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం:
కిలో వెండి ప్రస్తుతం రూ.3,10,000 వద్ద కొనసాగుతోంది.
చెన్నై:
ఇక్కడ కూడా కిలో వెండి రూ.3,10,000గా ఉంది.
ఢిల్లీ:
కిలో వెండి ధర రూ.2,95,000గా నమోదైంది.
