Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం తలగాస్‌పల్లె సమీపంలో వ్యవసాయ కూలీలతో వెళ్తున్న ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఏడుగురు మృతి చెందగా, మరో నలుగురికి తీవ్ర గాయాలైనట్లు పోలీసులు తెలిపారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కుట్లూరు మండలం నెల్లుట్ల గ్రామానికి చెందిన 12 మంది వ్యవసాయ కూలీలు గార్లదిన్నెలో పని చేసేందుకు ఆటోలో వెళ్తున్నారు. తిరిగి వస్తుండగా ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు వీరి వాహనాన్ని ఢీకొట్టింది. మృతుల్లో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు.మిగిలిన క్షతగాత్రులు అనంతపురం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సమాచారం అందుకున్న జిల్లా ఎస్పీ జగదీష్, డీఎస్పీ వెంకటేశ్వర్లు ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. తదుపరి విచారణ నిమిత్తం ఆర్టీసీ బస్సు డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
సీఎం చంద్రబాబు నాయుడు సంతాపం తెలిపారు ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం ప్రకటించి, క్షతగాత్రులకు సరైన వైద్యం అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు.