Cinema: భారీ ఆఫర్.. ఆ నటికి రూ.530 కోట్ల రెమ్యునరేషన్?

Sydney Sweeney being offered a Bollywood film with ₹530 crore paycheck

Sydney Sweeney being offered a Bollywood film with ₹530 crore paycheck

Cinema: హాలీవుడ్ నటి సిడ్నీ స్వీనీకి బాలీవుడ్ నుంచి విపరీతమైన ఆఫర్ వచ్చినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. భారతీయ సినీ పరిశ్రమలో ఇప్పటివరకు ఎప్పుడూ వినిపించని స్థాయిలో రెమ్యూనరేషన్ ఆఫర్ చేయడం చర్చనీయాంశంగా మారింది.

సినీవర్గాల సమాచారం ప్రకారం, బాలీవుడ్‌లో హయ్యెస్ట్ బడ్జెట్‌తో తెరకెక్కబోతున్న ఓ ప్రతిష్టాత్మక చిత్రంలో నటించేందుకు సిడ్నీ స్వీనీకి ఏకంగా రూ.530 కోట్ల రెమ్యూనరేషన్ ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్‌ను అంతర్జాతీయ స్థాయిలో ప్రమోట్ చేసి, ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకర్షించాలనే ఉద్దేశంతో మేకర్స్ హాలీవుడ్ స్టార్‌ను ఎంపిక చేసినట్టు సమాచారం.

ఇక ఈ భారీ మొత్తాన్ని వినగానే సినీ వర్గాల్లో పెద్ద చర్చ మొదలైంది. బాలీవుడ్‌లో ఇప్పటివరకు ఎవరూ ఇంత మొత్తాన్ని ఒకే సినిమాకి అందుకోలేదని చెబుతున్నారు. నిజంగానే ఈ ఆఫర్ ఫైనల్ అయితే, సిడ్నీ స్వీనీ ప్రపంచంలోనే అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకున్న నటీమణుల్లో ఒకరిగా నిలిచే అవకాశం ఉంది.

అయితే, ఈ వార్తపై ఇప్పటి వరకు అధికారిక ప్రకటన వెలువడలేదు. మేకర్స్ లేదా నటి వైపు నుంచి ఎలాంటి స్పష్టత రాకపోయినా, ఈ గాసిప్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. సినిమా అధికారికంగా ప్రకటించబడితే, బాలీవుడ్ మాత్రమే కాకుండా అంతర్జాతీయ సినీ పరిశ్రమలోనూ ఇది సంచలనాన్ని రేపడం ఖాయం.

Also Read: Ayyappa: మీకు తెలుసా.. ‘అయ్యప్ప’ అంటే అర్థం ఇదే!

Cinema: భారీ ఆఫర్.. ఆ నటికి రూ.530 కోట్ల రెమ్యునరేషన్?