Morning Routine: రోజు ప్రారంభం ఎలా ఉంటే, రోజంతా మన మూడ్ కూడా అలాగే ఉంటుంది. అందుకే ఉదయం నిద్రలేచిన వెంటనే కొన్ని ఆరోగ్యకరమైన అలవాట్లు పాటించడం చాలా ముఖ్యం. ఉదయాన్ని సానుకూల ఆలోచనలతో ప్రారంభిస్తే శరీరానికి మాత్రమే కాదు, మనసుకు కూడా మంచి ఉత్సాహం లభిస్తుంది. అందుకే ఉదయం లేచిన వెంటనే ఏం చేయాలి, ఏం చేయకూడదో తెలుసుకుని వాటిని అలవాటు చేసుకోవడం మంచిది.
ఉదయం నిద్రలేచిన తర్వాత చేయాల్సిన పనులు
గోరువెచ్చని నీరు తాగడం:
ఉదయం ఖాళీ కడుపుతో ఒక గ్లాసు గోరువెచ్చని నీరు తాగడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది శరీరంలోని విషపదార్థాలను బయటకు పంపించడంలో సహాయపడుతుంది. అలాగే జీర్ణక్రియ మెరుగుపడటానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. కడుపు ఆరోగ్యంగా ఉండటానికి ఈ అలవాటు చాలా మంచిది.
వ్యాయామం లేదా ధ్యానం చేయడం:
ఉదయం మంచం నుండి లేచిన తర్వాత కొంతసేపు యోగా లేదా తేలికపాటి వ్యాయామం చేయడం మంచిది. రోజును ధ్యానంతో ప్రారంభించడం వల్ల మనసుకు ప్రశాంతత లభిస్తుంది. రోజుకు కనీసం 15 నుంచి 20 నిమిషాలు ధ్యానం చేస్తే ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. అలాగే రోజంతా ఉత్సాహంగా ఉండేందుకు ఇది సహాయపడుతుంది.
సూర్యరశ్మి పొందడం:
ఉదయం కొద్దిసేపు ఎండలో గడపడం కూడా ఆరోగ్యానికి మంచిది. సూర్యరశ్మి వల్ల శరీరానికి అవసరమైన విటమిన్–D లభిస్తుంది. ఇది ఎముకలు, కండరాలు బలపడటానికి సహాయపడుతుంది. అంతేకాకుండా రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఉదయం ఎండలో కొద్దిసేపు కూర్చోవడం మనసుకు సానుకూల భావనను ఇస్తుంది.
పుస్తకం లేదా వార్తాపత్రిక చదవడం:
ఉదయం నిద్రలేచిన తర్వాత కొంత సమయం చదువుకు కేటాయించడం మంచిది. మీకు ఇష్టమైన పుస్తకం, మ్యాగజైన్ లేదా వార్తాపత్రిక చదవవచ్చు. ఇలా చేయడం వల్ల మెదడు చురుకుగా పనిచేస్తుంది. రోజును సానుకూల ఆలోచనలతో ప్రారంభించడానికి ఇది సహాయపడుతుంది.
ఉదయం లేచిన వెంటనే చేయకూడని పనులు
ఉదయం నిద్రలేచిన వెంటనే కొన్ని అలవాట్లను మాత్రం దూరంగా ఉంచాలి.
-
వెంటనే టీ, కాఫీ వంటి కెఫిన్ పానీయాలు తాగకపోవడం మంచిది.
-
లేచిన వెంటనే ఒత్తిడి కలిగించే పనుల్లో పడకూడదు.
-
మొబైల్ ఫోన్, ల్యాప్టాప్ లేదా టీవీ చూడకుండా కొంత సమయం దూరంగా ఉండాలి.
-
అలాగే ఉదయం లేచిన వెంటనే కోపం లేదా ఆందోళనకు లోనవ్వకూడదు.
ఈ చిన్న చిన్న అలవాట్లను పాటిస్తే రోజంతా ఉత్సాహంగా, సానుకూలంగా గడపవచ్చు. కాబట్టి ప్రతి రోజు ఉదయాన్ని ఆరోగ్యకరమైన అలవాట్లతో ప్రారంభించడం ఎంతో మంచిది.
Morning Routine: ఉదయం నిద్ర లేవగానే ఏం చేయాలి, ఏం చేయకూడదంటే..!