Mega Family: మెగా ఫ్యామిలీకి మరో వారసుడు.. తల్లిదండ్రులైన వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి

Tollywood Stars Varun Tej, Lavanya Tripathi Welcome Baby Boy

Tollywood Stars Varun Tej, Lavanya Tripathi Welcome Baby Boy

Mega Family: టాలీవుడ్ నటులు వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి దంపతులకు బాబుకు జన్మనిచ్చారు. కాసేపటి క్రితమే లావణ్య మగబిడ్డకు జన్మనివ్వగా, ఈ శుభవార్త తెలిసిన వెంటనే మెగా అభిమానులు హర్షం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ఇక ఈ సంతోషాన్ని తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి షూటింగ్ సెట్స్ నుంచి నేరుగా ఆసుపత్రికి వెళ్లి వరుణ్, లావణ్యను ఆశీర్వదించారు. 2023 నవంబర్ 1న ఇటలీలో వీరి పెళ్లి ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. తాము తల్లిదండ్రులం కాబోతున్నామని ఈ ఏడాది మేలో సోషల్ మీడియాలో “జీవితంలో అతి అందమైన పాత్ర పోషించబోతున్నాం… కమింగ్ సూన్” అనే సందేశంతో ఈ జంట అభిమానులతో పంచుకున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Varun Tej Konidela (@varunkonidela7)

తాజాగా బాబు పుట్టడంతో మెగా కుటుంబంలో ఆనందం వెల్లివిరుస్తోంది. వరుణ్ తేజ్ దంపతులకు సినీ ప్రముఖులు, అభిమానుల నుంచి శుభాకాంక్షల జల్లు కురుస్తోంది.

గమనించదగిన విషయం ఏమిటంటే, వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి జంటగా తొలిసారి 2017లో వచ్చిన మిస్టర్ సినిమాలో నటించారు. ఆ పరిచయం క్రమంగా స్నేహంగా, ఆ తర్వాత ప్రేమగా మారింది. అంతరిక్షం సినిమాలో కూడా కలిసి నటించిన ఈ జంట, చివరికి కుటుంబ పెద్దల సమక్షంలో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఇప్పుడు బాబు పుట్టడంతో వారి జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమైంది.

Also Read: Gold Rates: దీపావళికి బంగారం ధరలు తగ్గుతాయా..??

Mega Family: మెగా ఫ్యామిలీకి మరో వారసుడు.. తల్లిదండ్రులైన వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి