Curd: పాలు, పెరుగు శరీరానికి ఎంతో మేలు చేస్తాయని అందరికీ తెలుసు. వీటిలో ఉన్న పోషకాలు ఎముకలు బలంగా ఉండేందుకు, జీర్ణక్రియ మెరుగుపడేందుకు, రోగనిరోధక శక్తి పెరగడానికి ఉపయోగపడతాయి. అయితే వీటిని తీసుకునే సమయానికి కూడా చాలా ప్రాధాన్యం ఉంది. ఆరోగ్య నిపుణుల ప్రకారం, ముఖ్యంగా ఉదయం ఖాళీ కడుపుతో పాలు లేదా పెరుగు తీసుకోవడం శరీరానికి మంచిది కాదని చెబుతున్నారు.
చాలామంది ఉదయం లేవగానే వేడి పాల గ్లాస్‌తో రోజును ప్రారంభిస్తారు. అలాగే కొందరు అల్పాహారం ముందే పెరుగు తింటారు. కానీ ఖాళీ కడుపుతో వీటిని తినడం వల్ల శరీరానికి అనేక సమస్యలు వస్తాయి. పాలలో ఉండే సహజ లాక్టిక్ ఆమ్లం కడుపులోకి వెళ్లి అసిడిటీ, ఉబ్బరం, కడుపు నొప్పి వంటి సమస్యలను కలిగిస్తుంది. అదే విధంగా పెరుగులో ఉండే బ్యాక్టీరియా సాధారణంగా ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కానీ ఖాళీ కడుపుతో తీసుకుంటే యాసిడ్ రిఫ్లక్స్, ఉబ్బరం సమస్యలకు దారితీస్తుంది.
నిపుణుల అభిప్రాయం ప్రకారం, పాలు, పెరుగు వంటివి ఆహారం తిన్న తర్వాత లేదా మధ్యాహ్నం, రాత్రి సమయంలో తీసుకోవడం మంచిదని చెబుతున్నారు. అలా చేస్తే వీటిలోని పోషకాలు శరీరానికి పూర్తిగా అందుతాయి. ఖాళీ కడుపుతో తీసుకోవడం తప్పనిసరిగా నివారించాలి.
అందువల్ల పాలు, పెరుగు ఆరోగ్యానికి మేలు చేస్తాయని నిజమే కానీ అవి సరైన సమయానికి, సరైన విధంగా తీసుకున్నప్పుడే ప్రయోజనకరం అవుతాయి. సమయం తప్పిస్తే మేలు కంటే హానే ఎక్కువ అవుతుందని గుర్తుంచుకోవాలి.
Also Read: Almonds: బాదం ఆరోగ్యానికి మంచిదే.. కానీ ఎక్కువ తింటే..!!
Curd: ఉదయాన్నే ఖాళీ కడుపుతో పెరుగన్నం తింటున్నారా..??
