Memories: మిమ్మల్ని వదిలి వెళ్లిన వాళ్ల గురించే ఆలోచిస్తున్నారా.. ఒక్కసారి ఇది చదవండి

Memories: Are you thinking about those who left you?

Memories: Are you thinking about those who left you?

Memories: మనల్ని వదిలి వెళ్లిపోయిన వాళ్ల గురించే మళ్లీ మళ్లీ ఆలోచిస్తూ ఉంటే మనసు మరింత బాధపడుతుంది. ఇది సహజమే అయినా, దీన్ని ఎక్కువగా పట్టించుకుంటే మన జీవితం ముందుకు సాగదు. గతంలో ఎవరో మనల్ని వదిలి వెళ్లిపోవడం వల్ల మన జీవితంలో వెలితిగా అనిపించవచ్చు.

కానీ వారు వెళ్ళిపోవడం వల్ల మన విలువ తగ్గదని గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం. కొన్నిసారి అది కేవలం పరిస్థితులపై, వారి నిర్ణయాలపైనా ఆధారపడి ఉండవచ్చు. జీవితంలో అందరూ ఎప్పుడూ మనతో ఉండరు. కొందరు మాత్రమే ఉంటారు. చాలామంది ఒక దశలో వరకే మనతో ఉంటారు, తర్వాత తమదైన మార్గంలో వెళ్లిపోతారు.

వారిని గుర్తుచేసుకుంటూ మనసును కలవరపెట్టుకోవడం కన్నా, ప్రస్తుతం మనతో ఉన్నవారిని గుర్తించడం చాలా ముఖ్యమైన విషయం. మనల్ని వదిలిన వాళ్ల గురించి ఆలోచిస్తూనే ఉంటే కొత్త సంబంధాలను అంగీకరించలేం, కొత్త అవకాశాలను గుర్తించలేం. మనల్ని వదిలి వెళ్లిన వాళ్ల కోసం కన్నీళ్లు పెట్టుకోవడం కంటే, వాళ్ల లేని జీవితం మనం మరింత అందంగా గడపగలమనే నమ్మకం కలిగి ఉండడం చాలా అవసరం.

ప్రతి వ్యక్తి మన జీవితంలోకి ఒక పాఠం చెప్పడానికి వస్తారు. ఎవరైనా వెళ్లిపోతే, వారు చెప్పాల్సిన పాఠం పూర్తయ్యిందని అర్థం చేసుకోవాలి. ఇక నుంచి మన జీవితం ఎలా ఉండాలో మనమే నిర్ణయించుకోవాలి. అందుకు గతాన్ని మర్చిపోకపోయినా పర్లేదు. కానీ దాన్ని భారంగా మోయకూడదు.

మనల్ని నిజంగా విలువైనవారమని భావించే వాళ్లతో గడపడం, కొత్త కలలను సాధించడానికి ప్రయత్నించడం మనకు మరింత ఆనందాన్నిస్తుంది. కాబట్టి, మనల్ని వదిలి వెళ్లిన వాళ్ల గురించి మళ్లీ మళ్లీ ఆలోచించకుండా, మనం ఉన్న దాంట్లో సంతోషాన్ని కనుగొనడం అలవర్చుకోవాలి. గతాన్ని వదిలేస్తేనే భవిష్యత్తు వెలుగులు మన ముందుకు వస్తాయి. చివరగా ఒక్క మాట.. ఏది జరిగినా మన మంచికే.

Also Read: Marriage: 30 దాటినా పెళ్లి చేసుకోకపోవడానికి కారణాలివే

Memories: మిమ్మల్ని వదిలి వెళ్లిన వాళ్ల గురించే ఆలోచిస్తున్నారా.. ఒక్కసారి ఇది చదవండి