Gouher Sultana: క్రికెట్ కు టీమ్ ఇండియా ప్లేయర్ వీడ్కోలు

Indian woman spinner Gouher Sultana announces retirement from all forms of cricket

Indian woman spinner Gouher Sultana announces retirement from all forms of cricket

 Gouher Sultana: భారత ఎడమచేతి స్పిన్నర్ గౌహర్ సుల్తానా క్రికెట్‌కు వీడ్కోలు పలికారు. అన్ని రకాల ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్ తీసుకుంటున్నట్టు ఆమె సోషల్ మీడియాలో ప్రకటించారు. దీంతో రెండు వైట్-బాల్ ఫార్మాట్లలో జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన ఆమె కెరీర్ ముగిసింది.

“హైదరాబాద్ వీధుల నుంచి ప్రపంచ క్రికెట్ వేదికల వరకు సాగిన నా ప్రయాణం చెమట, త్యాగం, కృషితో నిండిన ఒక కల వంటిది. భారత జెర్సీ ధరించి ఆడటం నా జీవితంలో గొప్ప గౌరవం. తీసిన ప్రతి వికెట్, మైదానంలో పడిన ప్రతి డైవ్ నాకు అపూర్వ అనుభూతి ఇచ్చాయి” అని గౌహర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నారు.

ఆమె కెరీర్ గణాంకాలు: 50 వన్డేలు ఆడి 66 వికెట్లు (సగటు 19.39, ఎకానమీ 3.32) తీశారు. అలాగే 37 టీ20ల్లో 29 వికెట్లు (సగటు 26.27, ఎకానమీ 5.73) దక్కించుకున్నారు. బ్యాటింగ్‌లో వన్డేల్లో 96 పరుగులు చేశారు. చివరిసారిగా 2014లో భారత్ తరపున ఆడి, అదే సంవత్సరం బంగ్లాదేశ్‌లో జరిగిన మహిళల టీ20 వరల్డ్ కప్ తర్వాత జట్టులో చోటు కోల్పోయారు.

దేశీయ క్రికెట్‌లో హైదరాబాద్, పుదుచ్చేరి, రైల్వేస్, బెంగాల్ తరపున ఆడిన గౌహర్, తన ఫ్లైట్, స్పిన్, ఖచ్చితత్వంతో గుర్తింపు పొందారు. వుమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL)లో UP వారియర్స్ తరపున నాలుగు మ్యాచ్‌లు ఆడినా వికెట్ సాధించలేకపోయారు.

“క్రికెట్ నాకు విజయాలు, ఓటములు, గాయాలు, పునరాగమనాలు అన్నింటినీ నేర్పింది. ఈ ప్రయాణంలో నన్ను నిలబెట్టిన సహచరులు, కోచ్‌లు, సెలెక్టర్లు, అభిమానులందరికీ నా కృతజ్ఞతలు. నా తల్లి, సోదరికి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఆటగాడిగా నా కెరీర్ ముగిసినా, క్రికెట్ పట్ల ప్రేమ మాత్రం మరింత బలంగా ఉంటుంది. ఆటకు కొత్త రకాలుగా తోడ్పడతాను.

Also Read: Crime: భార్యాభర్తల పర్సనల్ వీడియోలు తీసి.. డబ్బులివ్వకపోతే సోషల్ మీడియాలో పెడతానని బెదిరింపులు

Gouher Sultana: క్రికెట్ కు టీమ్ ఇండియా ప్లేయర్ వీడ్కోలు