Naked Puja: తిరుప్పత్తూరు జిల్లా పూసిక్కల్మేడు గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి జరిగిన ఘటనతో అక్కడి ప్రజలు కలకలం రేగిపోయారు. పూసిక్కల్మేడు గ్రామానికి చెందిన తిరుపతి కుమారుడు పరశురామన్. అదే గ్రామానికి చెందిన రాజాత్తి ఇంటి ముందు అర్ధరాత్రి వెలుతురు కనిపించడంతో కుమరన్ అనే యువకుడు అక్కడికి వెళ్లి చూసాడు.
ఆ సమయంలో పరశురామన్ నగ్నంగా కూర్చుని పూజలు చేస్తుండటాన్ని చూసి, ఎందుకు ఇలా చేస్తున్నావని ప్రశ్నించాడు. దీనిపై ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. అయితే స్థానికులు మధ్యవర్తిత్వం చేసి వారిని శాంతింపజేసి ఇళ్లకు పంపారు.
అయితే, ఘటన అక్కడితో ముగియలేదు. కొద్ది సేపటికే కుమరన్ తన తల్లి జయలక్ష్మితో కలిసి ఇంట్లో నిద్రిస్తుండగా, పరశురామన్ సోదరుడు శాంతకుమార్ ఇంట్లోకి చొరబడ్డాడు. కుమరన్‌పై బండరాయితో దాడి చేసి చంపేందుకు యత్నించాడు.
ఈ దాడిలో కుమరన్ తీవ్రంగా గాయపడ్డాడు. కుమరన్ తల్లి కేకలు వేయడంతో పొరుగువారు అప్రమత్తమై అక్కడికి చేరుకుని గాయపడిన కుమరన్‌ను తిరుప్పత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బాధితుడి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి పరశురామన్, శాంతకుమార్‌లను అరెస్టు చేశారు. అనంతరం వారిని కోర్టులో హాజరుపర్చగా, రిమాండ్‌కు తరలించారు.
