Suprem Court: లైంగిక సమ్మతికి 18 ఏళ్లు తప్పనిసరి

Adolescent romance can't be grounds to lower age of consent: Government

Adolescent romance can't be grounds to lower age of consent: Government

Suprem Court: పద్దెనిమిదేళ్లు దాటిన వారికే లైంగిక చర్యకు సమ్మతి తెలిపే అర్హత ఉందన్న ప్రస్తుత చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం సమర్థించింది. ఈ వయోపరిమితిని 18 నుంచి 16 సంవత్సరాలకు తగ్గించాలంటూ సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్ చేసిన వాదనపై సుప్రీంకోర్టులో ప్రభుత్వం స్పందించింది.

మైనారిటీ తీరని యువతను లైంగిక మోసాలు, దోపిడీల నుంచి రక్షించడమే ఈ నియమం లక్ష్యమని, దీన్ని ఉద్దేశపూర్వకంగా మరియు సుదీర్ఘంగా ఆలోచించి అమలు చేస్తున్నామని కేంద్రం తెలిపింది. యువతీ–యువకుల మధ్య శృంగారభరితమైన ప్రేమ పేరుతో ఈ వయోపరిమితిని తగ్గించడం చట్టవ్యతిరేకమే కాకుండా ప్రమాదకరమని అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్యా భాటి లిఖితపూర్వకంగా కోర్టుకు వివరించారు.

పిల్లల మౌనం, భావోద్వేగాలను ఆసరాగా చేసుకుని లైంగిక దురాగతాలకు పాల్పడే వారిని ఈ వయోపరిమితి కట్టడి చేస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. వయోపరిమితిని తగ్గిస్తే అదే సాకుగా పిల్లల అక్రమ రవాణా, బాలలపై జరిగే నేరాలు అడ్డూ అదుపు లేకుండా పెరిగిపోతాయని కూడా హెచ్చరించింది.

Also Read: French Fries: ఫ్రెంచ్ ఫ్రైస్ తింటే ఆ వ్యాధి కొని తెచ్చుకున్నట్టేనట

Suprem Court: లైంగిక సమ్మతికి 18 ఏళ్లు తప్పనిసరి