French Fries: ఫ్రెంచ్ ఫ్రైస్ తింటే ఆ వ్యాధి కొని తెచ్చుకున్నట్టేనట

A salty twist: Diabetes risk study says french fries are a culprit

A salty twist: Diabetes risk study says french fries are a culprit

French Fries: హార్వర్డ్, కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయాల పరిశోధకులు సహా పలువురు నిపుణులు 40 ఏళ్ల పాటు నిర్వహించిన విస్తృత అధ్యయనంలో ఆసక్తికరమైన విషయాలు వెలుగుచూశాయి. ఈ పరిశోధనలో భాగంగా 2 లక్షల మందిని ఎప్పటికప్పుడు వారి ఆరోగ్య పరిస్థితుల గురించి ప్రశ్నించి, సమాధానాలు సేకరించారు.

అధ్యయనం ప్రకారం, వారానికి మూడుసార్లు ఫ్రెంచ్ ఫ్రైస్ తింటే మధుమేహం వచ్చే ప్రమాదం 20 శాతం పెరుగుతుంది. నూనెలో బాగా వేయించి, ఉప్పు – కారం వేసిన ఫ్రెంచ్ ఫ్రైస్ ఎక్కువ ముప్పు కలిగిస్తాయి. అయితే, అదే మొత్తంలో ఉడికించిన లేదా వండిన బంగాళాదుంపలు తిన్నా ఈ స్థాయిలో ప్రమాదం ఉండదని తేలింది.

బంగాళాదుంపలను ఇతర రూపాల్లో తింటే మధుమేహ ముప్పు కేవలం 5 శాతం వరకే పరిమితం అవుతుంది. ఆలూను సమీకృత ధాన్యాలతో (whole grains) కలిపి తింటే ఈ ముప్పు మరింత తగ్గుతుంది. కానీ, అన్నంతో తినే అలవాటు ఉన్నవారు మాత్రం జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరించారు.

Also Read: Varalakshmi Vrat: వరలక్ష్మీ వ్రతం రోజు పొరపాటున కూడా మహిళలు ఈ పనులు చేయొద్దు

French Fries: ఫ్రెంచ్ ఫ్రైస్ తింటే ఆ వ్యాధి కొని తెచ్చుకున్నట్టేనట