Konda Surekha Post: త్వరలో బిగ్ అప్‌డేట్.. కొండా సురేఖ ఇంట్రస్టింగ్ పోస్ట్

Konda Surekha Post: Next Political Move Sparks Speculation After Cabinet Exit

Konda Surekha Post: తెలంగాణ మంత్రి కొండా సురేఖను కేబినెట్‌ నుంచి తొలగిస్తూ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు గవర్నర్‌కు లేఖ పంపగా, అనంతరం కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఇకపై ఆమె మంత్రిగా కొనసాగరని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. దీంతో ఈ అంశం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

మంత్రి పదవి నుంచి తొలగింపుపై మాజీ మంత్రి కొండా సురేఖ సోషల్‌ మీడియా వేదికగా స్పందించారు. తన రాజకీయ భవిష్యత్‌పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. “ఇక నిరీక్షణ ముగిసింది” అంటూ ఆమె తాజాగా పోస్ట్‌ పెట్టారు. అంతేకాకుండా త్వరలోనే కీలక నిర్ణయాన్ని ప్రకటించనున్నట్లు వెల్లడించారు.

Governor approves CM's decision to sack Konda Surekha

దీంతో కొండా సురేఖ తదుపరి రాజకీయ నిర్ణయం ఏమిటనే దానిపై చర్చ మొదలైంది. ఆమె ఎలాంటి రాజకీయ అడుగు వేయబోతున్నారు? త్వరలో ప్రకటించనున్న కీలక నిర్ణయం ఏమిటి? అనే అంశాలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

రాబోయే రోజుల్లో తెలంగాణ కాంగ్రెస్‌లో మరిన్ని రాజకీయ పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉందనే చర్చ కూడా జరుగుతోంది. అయితే కొండా సురేఖ తన తదుపరి నిర్ణయంపై అధికారికంగా ప్రకటించే వరకు దీనిపై స్పష్టత వచ్చే అవకాశం లేదు.

Also Read: Big Shock: కొండా సురేఖకు బిగ్ షాక్.. మంత్రివర్గం నుంచి బర్తరఫ్!