Krishna Janmashtami 2026: కృష్ణాష్టమి పూజకు ఇదే సరైన సమయం.. ఇలా పూజ చేస్తే..!

Krishna Janmashtami 2026: Know the Auspicious Pooja Time for Bal Krishna

Krishna Janmashtami 2026: శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా దేశవ్యాప్తంగా భక్తులు ప్రత్యేక పూజలకు సిద్ధమవుతున్నారు. శ్రీమహావిష్ణువు అవతారాల్లో శ్రీకృష్ణుడి జన్మదినాన్ని((Krishna Janmashtami) అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకోవడం ఆనవాయితీ. ఈ రోజున ఉపవాసం ఉండి, రాత్రి సమయంలో బాలకృష్ణుడికి ప్రత్యేక పూజలు చేయడం ముఖ్యంగా భావిస్తారు.

ఈ ఏడాది సెప్టెంబర్ 4న శ్రీకృష్ణ జన్మాష్టమి జరుపుకోనున్నారు. భక్తులు ఉదయాన్నే తలస్నానం చేసి, తమ శక్తి మేరకు ఉపవాస దీక్ష పాటిస్తారు. రోజంతా శ్రీకృష్ణుడిని స్మరిస్తూ భజనలు, కీర్తనలు చేస్తారు. ఇంట్లో బాలకృష్ణుడి విగ్రహం లేదా చిత్రపటాన్ని ఏర్పాటు చేసి ప్రత్యేకంగా అలంకరిస్తారు.

Also Read: Reheating Tea: టీని మళ్లీ మళ్లీ వేడి చేసుకుని తాగుతున్నారా?

ముఖ్యంగా కృష్ణుడి జన్మ సమయంగా భావించే అర్ధరాత్రి వేళలో పూజలు నిర్వహిస్తారు. సెప్టెంబర్ 4 అర్ధరాత్రి 11:57 గంటల నుంచి సెప్టెంబర్ 5న 12:43 గంటల వరకు పూజా ముహూర్తం ఉన్నట్లు పండితులు చెబుతున్నారు. ఈ సమయంలో బాలకృష్ణుడికి భక్తిశ్రద్ధలతో పూజలు చేసి, ఉయ్యాలలో స్వామివారిని అలంకరించడం ఆనవాయితీగా వస్తోంది.

Krishna Janmashtami 2026: Date, Muhurat, Puja Vidhi — The Open Press

పూజలో భాగంగా బాలకృష్ణుడికి వెన్న, పాలు, పెరుగు, పండ్లు, మిఠాయిలు వంటి నైవేద్యాలను సమర్పిస్తారు. కృష్ణుడికి వెన్న అంటే ఎంతో ఇష్టమనే నమ్మకంతో ప్రత్యేకంగా వెన్నను నైవేద్యంగా పెడతారు. అనంతరం హారతి ఇచ్చి కుటుంబ సభ్యులంతా కలిసి శ్రీకృష్ణుడిని ప్రార్థిస్తారు.

Also Read: BP Tablets: బీపీ టాబ్లెట్ మానేశారా.. ఐతే ఈ వార్త మీ కోసమే..!

జన్మాష్టమి రోజున ఉపవాసం, పూజలు చేయడం వల్ల శ్రీకృష్ణుడి అనుగ్రహం లభిస్తుందని భక్తుల విశ్వాసం. కుటుంబంలో సుఖసంతోషాలు, శాంతి, ఐశ్వర్యం కలగాలని స్వామివారిని ప్రార్థిస్తారు. అయితే ఉపవాసం విషయంలో ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్య పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవడం మంచిది.

శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఆలయాల్లో కూడా ప్రత్యేక పూజలు, అభిషేకాలు, భజనలు నిర్వహిస్తారు. అర్ధరాత్రి సమయంలో కృష్ణుడి జన్మవృత్తాంతాన్ని స్మరించుకుంటూ భక్తులు వేడుకలు జరుపుకుంటారు. చిన్నారులను బాలకృష్ణుడి వేషధారణలో అలంకరించడం కూడా ఈ పండుగలో ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది.

Also Read: Doctors Advise: ఫ్లష్ చేసే ముందు ఒక్కసారి చూడండి.. డాక్టర్లు ఎందుకు చెబుతున్నారంటే?