Konda Surekha Resign: తెలంగాణ రాజకీయాల్లో మంత్రి కొండా సురేఖ వ్యవహారం మరోసారి హాట్‌టాపిక్‌గా మారింది. మంత్రి పదవికి రాజీనామా(Konda Surekha Resign) చేయాలని కాంగ్రెస్ అధిష్ఠానం నుంచి ఆమెకు సూచనలు వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఒకవేళ రాజీనామా చేయకపోతే బర్తరఫ్ చేయాల్సిన పరిస్థితి వస్తుందని అధిష్ఠానం స్పష్టం చేసినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
సాయంత్రంలోగా మంత్రి పదవికి రాజీనామా చేయాలని కొండా సురేఖకు సూచించినట్లు సమాచారం. ఆమె స్వయంగా రాజీనామా చేయకపోతే లోక్‌భవన్‌కు బర్తరఫ్ లేఖ పంపించే అవకాశం ఉందని హెచ్చరించినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో ఈ వ్యవహారం తెలంగాణ కాంగ్రెస్‌లో తీవ్ర చర్చకు దారితీసింది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ముగించుకుని హైదరాబాద్‌కు చేరుకునేలోపే కొండా సురేఖ రాజీనామా చేసే అవకాశం ఉందని కొన్ని వర్గాలు చెబుతున్నాయి. బర్తరఫ్ వేటు ఎదుర్కొనే కంటే ముందుగానే మంత్రి పదవికి రాజీనామా చేయడమే మంచిదనే నిర్ణయానికి ఆమె వచ్చినట్లు కూడా ప్రచారం సాగుతోంది.
Also Read: Irumudi Sequel: ‘ఇరుముడి’ సీక్వెల్‌పై డైరెక్టర్ షాకింగ్ క్లారిటీ.. రామ్ చరణ్ ప్రచారంపైనా స్పందన!
ఈ వ్యవహారంలో కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే కూడా జోక్యం చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మంత్రి పదవికి రాజీనామా చేయాలని, లేకపోతే బర్తరఫ్ చేయాల్సిన పరిస్థితి వస్తుందని, పరిస్థితిని అంతవరకు తీసుకురావద్దని ఖర్గే సూచించినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే తన నిర్ణయంపై పునరాలోచించాలని కొండా సురేఖ కోరినప్పటికీ ఆమెకు ఊరట లభించలేదని సమాచారం.
ఇదిలా ఉంటే మంత్రి పదవికి రాజీనామా చేసిన తర్వాత కూడా పార్టీలో కొనసాగడం అవమానకరంగా భావిస్తున్నట్లు కొండా సురేఖ సన్నిహిత వర్గాల్లో చర్చ జరుగుతోంది. దీంతో మంత్రి పదవితో పాటు కాంగ్రెస్ పార్టీకి కూడా రాజీనామా చేసే ఆలోచనలో ఆమె ఉన్నట్లు ప్రచారం మరింత ఊపందుకుంది.
అయితే కొండా సురేఖ రాజీనామా, బర్తరఫ్ లేదా పార్టీకి రాజీనామా వంటి అంశాలపై అధికారిక ప్రకటన వెలువడే వరకు ఇవన్నీ రాజకీయ వర్గాల్లో జరుగుతున్న ప్రచారంగానే చూడాల్సి ఉంటుంది. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ అధిష్ఠానం, కొండా సురేఖ లేదా తెలంగాణ ప్రభుత్వం నుంచి అధికారికంగా ఎలాంటి ప్రకటన వస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
Also Read: MS Dhoni: ‘హుక్కా తాగి వస్తా’.. ధోనీ కామెంట్స్ వైరల్.. పంత్ రిప్లై కూడా!
