Gold Rates: గుడ్‌న్యూస్.. 4గంటల్లోనే రూ.5వేలు తగ్గింది!

Gold and Silver Prices Fall: Check 22K And 24K City-Wise

Gold and Silver Prices Fall: Check 22K And 24K City-Wise

Gold Rates: సాధారణంగా యుద్ధ పరిస్థితులు నెలకొన్నప్పుడు బంగారం ధరలు పెరగడం సహజం. కానీ ఈసారి మాత్రం పరిస్థితి కాస్త భిన్నంగా కనిపించింది. గత రెండు రోజులుగా బంగారం, వెండి ధరలు తగ్గి సామాన్యులకు కొంత ఊరట కలిగించాయి. అయితే ఆ ఆనందం ఎక్కువ సేపు నిలవలేదు. ఊహించని విధంగా మళ్లీ బంగారం ధరలు ఒక్కసారిగా పెరిగాయి. శుక్రవారం కేవలం నాలుగు గంటల్లోనే తులం బంగారం ధర సుమారు రూ.650 పెరగడం గమనార్హం.

హైదరాబాద్‌లో ప్రస్తుతం 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,50,930గా ఉంది. అయితే ఉదయం 6 గంటల సమయంలో ఇది రూ.1,50,270 వద్ద ఉండేది. అంటే కేవలం నాలుగు గంటల్లోనే రూ.600కు పైగా పెరిగింది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర ప్రస్తుతం రూ.1,38,350గా ఉండగా, ఉదయం రూ.1,37,740 వద్ద ఉంది.

ఇలాంటి ధరలే ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, విశాఖపట్నం నగరాలతో పాటు ముంబై, బెంగళూరు, కేరళ, పూణే వంటి నగరాల్లో కూడా కొనసాగుతున్నాయి. ఈ ప్రాంతాల్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,50,930గా ఉండగా, 22 క్యారెట్ల ధర రూ.1,38,350 వద్ద ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో కూడా బంగారం ధరలు పెరిగాయి. అక్కడ 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర ప్రస్తుతం రూ.1,51,080గా ఉంది. ఉదయం ఇది రూ.1,50,420 వద్ద ఉండేది. 22 క్యారెట్ల బంగారం ధర అక్కడ రూ.1,35,500గా ఉంది. చెన్నైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,51,630గా ఉండగా, 22 క్యారెట్ల ధర రూ.1,38,999గా నమోదైంది.

వెండి ధరల విషయానికి వస్తే, హైదరాబాద్‌లో ఉదయం కిలో వెండి ధర రూ.2,64,900గా ఉండగా, స్వల్పంగా రూ.100 తగ్గింది. అయితే దేశీయ మార్కెట్‌లో మాత్రం వెండి ధరల్లో భారీ పడిపోవడం కనిపించింది. ఉదయం రూ.2,60,000గా ఉన్న వెండి ధర, నాలుగు గంటల్లోనే రూ.5,000 తగ్గి ప్రస్తుతం రూ.2,55,000 వద్ద ట్రేడవుతోంది.

మొత్తంగా చూస్తే, బంగారం ధరలు ఒక్కసారిగా పెరగడం, వెండి ధరలు తగ్గడం వల్ల మార్కెట్‌లో తీవ్ర హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. దీంతో కొనుగోలుదారులు అప్రమత్తంగా వ్యవహరించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Also Read: Telangana: కొత్త పెన్షన్ దారులకు గుడ్ న్యూస్

Gold Rates: గుడ్‌న్యూస్.. 4గంటల్లోనే రూ.5వేలు తగ్గింది!