Trump: ట్రంప్‌ విమానంలో సాంకేతిక లోపం

US News: Air Force One With Trump Returns After Technical Glitch

US News: Air Force One With Trump Returns After Technical Glitch

Trump: స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (WEF) సదస్సుకు హాజరు కావడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎయిర్ ఫోర్స్ వన్‌లో బయల్దేరారు. అయితే విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే సాంకేతిక సమస్య తలెత్తింది. ప్రెస్ క్యాబిన్‌లో కొంతసేపు లైట్లు ఆగిపోవడంతో విమాన సిబ్బంది అప్రమత్తమయ్యారు.

దీంతో వెంటనే ఆ విమానాన్ని తిరిగి వాషింగ్టన్ సమీపంలోని జాయింట్ బేస్ ఆండ్రూస్ వద్దకు మళ్లించి సురక్షితంగా ల్యాండింగ్ చేశారు. అనంతరం ట్రంప్ మరో విమానంలో దావోస్ ప్రయాణాన్ని కొనసాగించారు. ఇదే సమయంలో 2024లోనూ ట్రంప్‌కి చెందిన ఓ ప్రైవేట్ జెట్ మోంటానాకు వెళ్తుండగా ఇదే తరహా సాంకేతిక లోపం తలెత్తిన ఘటన గుర్తుకు వస్తోంది. ఆ సందర్భంలో కూడా ఆ విమానాన్ని బిలింగ్స్ విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది.

Also Read: Bihar: ముస్లిం వివాహాల్లో రాముడి పాటలు, సింధూరం

Trump: ట్రంప్‌ విమానంలో సాంకేతిక లోపం