Gold Prices: తగ్గుతాయో ఏమో అని ఎదురుచూస్తున్న ఆశగా కొనుగోలుదారులకు బంగారం ధరలు మరోసారి నిరాశపర్చాయి. రోజురోజుకు రేట్లు పెరుగుతూ గోల్డ్ మార్కెట్ ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. గత వారం వ్యవధిలోనే బంగారం రూ.3 వేల రూపాయల వరకు పెరగ్గా… ఈ వారం కూడా అదే ధోరణి కొనసాగుతోంది. ప్రత్యేకించి సోమవారం నుండి “తగ్గేదేలే” అన్నట్లుగా ధరలు పెరుగుతూ వస్తున్నాయి. అంతర్జాతీయంగా రాజకీయ ఉద్రిక్తతలు, దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు, ఆర్థిక అనిశ్చితి కారణంగా గోల్డ్‌కు డిమాండ్ పెరిగి ధరలు కూడా ఎగబాకుతున్నాయనే అభిప్రాయం బిజినెస్ వర్గాలది.
ఇప్పుడు రేట్లు ఎలా ఉన్నాయంటే…
హైదరాబాద్:
10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర ప్రస్తుతం రూ.1,49,790 వద్ద నమోదైంది. నిన్న ఈ ధర రూ.1,49,780 వద్ద నిలిచింది. 22 క్యారెట్ల బంగారం ధర ప్రస్తుతం రూ.1,37,310 కాగా నిన్న రూ.1,37,300గా ఉంది.
విజయవాడ:
24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.1,49,790గా ఉండగా… 22 క్యారెట్ల ధర కూడా హైదరాబాద్ మాదిరిగానే రూ.1,37,310 వద్ద కొనసాగుతోంది.
చెన్నై:
ఇక్కడ 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,51,650కు చేరగా… 22 క్యారెట్ల రేటు రూ.1,39,010గా ఉంది.
బెంగళూరు:
24 క్యారెట్ల బంగారం ధర ప్రస్తుతం రూ.1,49,790 కాగా… 22 క్యారెట్ల ధర రూ.1,37,310 వద్ద కొనసాగుతోంది.
ఢిల్లీ:
ఇక్కడ 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ.1,49,920, 22 క్యారెట్ల ధర రూ.1,37,460గా నమోదైంది.
వెండి పరిస్థితి ఎలా ఉందంటే…
ఢిల్లీ: కిలో వెండి రూ.3,20,100 వద్ద
హైదరాబాద్: కిలో వెండి రూ.3,40,100 (నిన్న రూ.3,40,000)
చెన్నై: కిలో వెండి రూ.3,40,100 (నిన్న రూ.3,40,000)
బెంగళూరు: కిలో వెండి రూ.3,20,100 (నిన్న రూ.3,20,000)
మొత్తానికి… బంగారం–వెండి ధరలు తగ్గే సూచనలు ప్రస్తుతం కనిపించడం లేదు. కొనుగోలుదారులు కొంచెం ఇబ్బందిపడుతున్నా… పెట్టుబడిదారులకు మాత్రం ఇది మంచి సమయం అన్న భావన మార్కెట్లో వినిపిస్తోంది.
Also Read: Medaram Jatara: మేడారం జాతరకు పోటెత్తిన భక్తులు
Gold Prices: రోజుకో షాక్.. తులం బంగారం ఎంతుందంటే..
