Gold Rates: తులం బంగారం ధర ఎంత ఉందంటే..

Gold rate today: How much of 22K, 24K gold cost in your city

Gold rate today: How much of 22K, 24K gold cost in your city

Gold Rates: బంగారం, వెండి ధరలు తగ్గే సూచనలు కనిపించకుండా కొనసాగుతున్నాయి. గతంలో బంగారం ధర మాత్రమే పెరిగేది. అయితే ఇప్పుడు వెండి కూడా అదే వేగంతో కాకుండా, ఇంకా ఎక్కువగా పెరుగుతోంది. కారణం ఎలక్ట్రానిక్ పరికరాలు, తయారీ రంగం, ముఖ్యంగా ఎలక్ట్రిక్ వాహనాల్లో వెండి వినియోగం భారీగా పెరగడం. దీంతో వెండికి మార్కెట్లో భారీ డిమాండ్ ఏర్పడింది.

బంగారం విషయానికి వస్తే, నిన్నటితో పోలిస్తే తులాకు కేవలం రూ.10 మాత్రమే తగ్గింది. అయితే ఈ తగ్గింపు పెద్దగా ఊరటనిచ్చేలా లేదు. ఒక రోజు తగ్గితే, మరుసటి రోజు మళ్లీ భారీగా పెరగడం వినియోగదారులను కంగారుపడేలా చేస్తోంది.

జనవరి 12న ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి:

హైదరాబాద్ – 24 క్యారెట్ల 10 గ్రాములు: ₹1,40,450 | 22 క్యారెట్లు: ₹1,28,740
విజయవాడ – 24 క్యారెట్ల 10 గ్రాములు: ₹1,40,450 | 22 క్యారెట్లు: ₹1,28,740
ఢిల్లీ – 24 క్యారెట్ల 10 గ్రాములు: ₹1,40,600 | 22 క్యారెట్లు: ₹1,28,890 (ఇక్కడ ధరలు కాస్త ఎక్కువ)
ముంబై – 24 క్యారెట్ల 10 గ్రాములు: ₹1,40,450 | 22 క్యారెట్లు: ₹1,28,740
బెంగళూరు – 24 క్యారెట్ల 10 గ్రాములు: ₹1,40,450 | 22 క్యారెట్లు: ₹1,28,740
చెన్నై – 24 క్యారెట్ల 10 గ్రాములు: ₹1,39,640 | 22 క్యారెట్లు: ₹1,28,990 (సర్వసాధారణంగా ఇక్కడ ధరలు ఎక్కువగా ఉండేవి, కానీ ప్రస్తుతం కొద్దిగా తక్కువగా ఉన్నాయి)

వెండి ధరలు కూడా స్వల్పంగా తగ్గాయి. కిలోపై రూ.100 మాత్రమే తగ్గింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో కిలో వెండి రూ.2,74,900గా ఉంది. ఇతర నగరాల్లో సుమారుగా రూ.2,59,900 వద్ద ఉంది.

మొబైల్‌లో బంగారం ధర తెలుసుకోవాలనుకుంటే 8955664433 కు మిస్డ్ కాల్ ఇస్తే, SMS ద్వారా ధర సమాచారం అందుతుంది.

Also Read: Viral: “పంచె కట్టు నచ్చట్లేదు… భర్తకు విడాకులు కావాలి!”

Gold Rates: తులం బంగారం ధర ఎంత ఉందంటే..