Rajasaab: ‘రాజాసాబ్‌’ సినిమా టికెట్‌ ధరలు పెంపు

Government Approves Ticket Price Hike for Prabhas' Raja Saab

Government Approves Ticket Price Hike for Prabhas' Raja Saab

Rajasaab: ప్రభాస్ నటించిన ‘రాజాసాబ్’ చిత్రానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టికెట్ రేట్ల పెంపుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సంక్రాంతి బరిలో నిలిచే ఈ చిత్రం జనవరి 9న థియేటర్లలో విడుదల కానుంది. కొత్త ధరల ప్రకారం, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో టికెట్‌కు జీఎస్టీతో కలిపి అదనంగా రూ.150, మల్టీప్లెక్స్‌లలో జీఎస్టీతో కలిపి రూ.200 వరకు పెంచుకునే అవకాశం కల్పించింది. అలాగే రోజుకు ఐదు షోలు వేశేందుకు కూడా ప్రభుత్వ అనుమతి లభించింది.

పది రోజులపాటు ఈ ప్రత్యేక ధరలు అమల్లో ఉంటాయి. అంతేకాదు, విడుదలకు ఒక రోజు ముందే ప్రత్యేక ప్రీమియర్ షోలు ఏర్పాటు చేసుకునేందుకు కూడా సూచనలు లభించాయి. జనవరి 8న సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు ప్రీమియర్ షోలను ప్రదర్శించే వీలుంది. ఈ ప్రీమియర్ షోల టికెట్ ధరను జీఎస్టీతో కలిపి గరిష్టంగా రూ.1000 వరకు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చారు. ‘ఓజీ’ తర్వాత ఈ స్థాయి టికెట్ రేటు పెరుగుదల పొందిన సినిమా ఇదే కావడం విశేషం.

మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ హారర్ ఫాంటసీ కామెడీలో ప్రభాస్ సరసన మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిధి కుమార్ నటిస్తున్నారు. అలాగే సంజయ్ దత్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. సంగీతం తమన్ అందించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ దాదాపు రూ.300 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారు.

ఇప్పటికే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. కథా కంటెంట్‌, విజువల్స్‌, ప్రభాస్ స్క్రీన్ ప్రెజెన్స్‌పై అభిమానుల్లో మంచి ఆసక్తి నెలకొనడంతో విడుదలకు ముందే మార్కెట్లో పాజిటివ్ బజ్ ఏర్పడింది. సంక్రాంతి సెలవుల్లో భారీగానే హౌస్‌ఫుల్ షోలు నమోదయ్యే అవకాశం ఉందని ఫిల్మ్ వర్గాలు భావిస్తున్నాయి.

Also Read: Telangana: గజగజ.. ఒకసారిగా పెరిగిన చలి

Rajasaab: ‘రాజాసాబ్‌’ సినిమా టికెట్‌ ధరలు పెంపు