Vijay: తమిళ సినీ పరిశ్రమలో దళపతి విజయ్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దశాబ్దాలుగా కోట్లాది అభిమానుల మనసులు గెలుచుకున్న విజయ్ (Thalapathy Vijay), తన చివరి సినిమాగా ప్రకటించిన **‘జన నాయగన్’**తో మరోసారి రికార్డు స్థాయి హైప్‌ను సృష్టిస్తున్నారు. దీనికి తాజాగా జరిగిన ఆడియో లాంచ్ ఈవెంట్‌నే నిదర్శనంగా చెప్పొచ్చు.
డిసెంబర్ 27న మలేషియాలోని కౌలాలంపూర్ బుకిట్ జలీల్ స్టేడియంలో ఘనంగా నిర్వహించిన ‘జన నాయగన్’ ఆడియో లాంచ్ నిజంగా ఓ సినిమా పండుగను తలపించింది. ఓపెన్ స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమానికి దాదాపు లక్ష మంది అభిమానులు హాజరయ్యారు. భారీ స్టేజ్ సెటప్, అంతర్జాతీయ స్థాయి లైటింగ్, సౌండ్ డిజైన్ ఈ ఈవెంట్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అత్యధిక ప్రేక్షకులు పాల్గొన్న ఆడియో లాంచ్‌గా ఈ కార్యక్రమం మలేషియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది. శ్రీలంక తర్వాత ప్రపంచంలోనే అతిపెద్ద తమిళ ప్రవాసుల జనాభా మలేషియాలో ఉండటం విశేషం.
VIDEO | TVK chief Vijay stumbled and fell while trying to get into his car at the Chennai airport.
A large crowd of fans gathered to welcome him as he returned from Malaysia.
(Full video available on PTI Videos – https://t.co/n147TvrpG7) pic.twitter.com/x42Kpd0AsW
— Press Trust of India (@PTI_News) December 28, 2025
ఇదిలా ఉండగా, మలేషియా నుంచి చెన్నై ఎయిర్‌పోర్ట్‌కు విజయ్ చేరుకున్న సమయంలో భారీ సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. అభిమానులు ఒక్కసారిగా ఆయనను చుట్టుముట్టడంతో అక్కడ గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఆ సమయంలో కారు ఎక్కుతుండగా విజయ్ ఒక్కసారిగా జారి పడిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఈ ఘటనలో విజయ్‌కు ఎలాంటి గాయాలు కాకపోవడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.
విజయ్‌కు ఉన్న అపారమైన ఫ్యాన్ ఫాలోయింగ్‌ను చూసి మరోసారి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ‘జన నాయగన్’తో తన సినీ ప్రయాణానికి ముగింపు పలకబోతున్న విజయ్, ఈ సినిమాతోనే కాదు, తన అభిమానుల ప్రేమతో కూడా చరిత్ర సృష్టిస్తున్నారని చెప్పొచ్చు.
