AP TET 2025: ఏపీ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (ఏపీ టెట్ – డిసెంబర్ 2025) నేటి నుంచే ప్రారంభం కానుంది. డిసెంబర్ 21 వరకు ఈ పరీక్షలు కొనసాగుతాయి. విద్యాశాఖ ఇప్పటికే అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 133 కేంద్రాల్లో ప్రతి రోజు రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహిస్తారు. ఉదయం 9.30 నుంచి 12.00 వరకు తొలి సెషన్, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.00 వరకు రెండో సెషన్ జరుగుతుంది.
పరీక్ష మాదిరి మల్టిపుల్-చాయిస్ ప్రశ్నలే ఉంటాయి. ప్రతి ప్రశ్న ఒక మార్కుకు సమానం. ఈసారి నెగిటివ్ మార్కింగ్ ఉండదు.
ఈ టెట్‌కు మొత్తం 2,41,509 మంది అభ్యర్థులు 2,71,692 దరఖాస్తులు సమర్పించారు. కొందరు పేపర్–1, పేపర్–2 రెండింటికీ అప్లై చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల కారణంగా ఈసారి 32 వేలమంది ఇన్-సర్వీస్ టీచర్లు కూడా దరఖాస్తు చేసుకున్నారు.
అభ్యర్థులకు ముఖ్య సూచనలు
-
హాల్ టికెట్లు ఇప్పటికే డౌన్లోడ్ చేసుకోవచ్చు.
-
అప్లికేషన్‌లో ఎలాంటి పొరపాట్లు ఉన్నా, పరీక్ష కేంద్రంలో సరైన పత్రాలను చూపించి నామినల్ రోల్‌లో సరిచేసుకునే అవకాశం ఉంటుంది.
-
హాల్ టికెట్‌తో పాటు ఒరిజినల్ ఐడీ కార్డు తప్పనిసరిగా తీసుకురావాలి.
-
మొబైల్ ఫోన్, స్మార్ట్ వాచ్, బ్లూటూత్, ఇయర్‌ఫోన్స్ వంటి ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేదు.
-
కనీసం 60 నిమిషాల ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి. రిపోర్టింగ్ టైం తర్వాత వచ్చిన వారికి ప్రవేశం ఉండదు.
-
ప్రశ్నపత్రం సీరియల్ నంబర్‌ను తప్పనిసరిగా చెక్ చేయాలి.
-
కేంద్రంలో బయోమెట్రిక్ వెరిఫికేషన్ తప్పనిసరి.
పరీక్షల షెడ్యూల్
-
డిసెంబర్ 10: తెలుగు భాషా పరీక్ష (ఉదయం & మధ్యాహ్నం)
-
డిసెంబర్ 11: పలు ఇతర భాషా పేపర్లు
-
డిసెంబర్ 17: సోషల్ స్టడీస్
-
డిసెంబర్ 19: మ్యాథ్స్, సైన్స్ మరియు మరికొన్ని సబ్జెక్టులు
-
డిసెంబర్ 21: అన్ని సబ్జెక్టుల పరీక్షల ముగింపు
ఫలితాల వివరాలు
-
జనవరి 2: ప్రాథమిక కీ విడుదల
-
జనవరి 2–9: ప్రాథమిక కీపై అభ్యంతరాల స్వీకరణ
-
జనవరి 13: ఫైనల్ కీ ప్రకటింపు
-
జనవరి 19: టెట్ తుది ఫలితాల విడుదల
టెట్‌లో అర్హత పొంది మాత్రమే డీఎస్సీ పరీక్షకు హాజరు కావచ్చు. అలాగే ప్రైవేట్ పాఠశాలల్లో కూడా బోధించాలంటే టెట్ అర్హత అవసరం. టెట్‌లో సాధించిన మార్కులు డీఎస్సీ వెయిటేజీలో పరిగణనలోకి తీసుకుంటారు. అందుకే అభ్యర్థులు మంచి స్కోర్ కోసం ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారు.
అభ్యర్థుల సౌకర్యార్థం ఆన్‌లైన్ మాక్ టెస్టులు కూడా అందుబాటులో ఉన్నాయి. అధికారిక వెబ్‌సైట్ https://tet2dsc.apcfss.in/లో హాల్ టికెట్లు, మాక్ టెస్ట్‌లు మరియు ఇతర అప్డేట్‌లను చూసుకోవచ్చు.
