Rahul Gandhi: బీహార్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అన్ని పార్టీలు ప్రచారాన్ని వేగవంతం చేశాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ కూడా ప్రచారంలో దూకుడు పెంచారు. ఆదివారం బెగుసరాయ్ జిల్లాలో జరిగిన ర్యాలీలో పాల్గొన్న ఆయన, అక్కడి మత్స్యకారులతో ప్రత్యేకంగా మాట్లాడారు. మాటలకే పరిమితం కాకుండా వారితో కలిసి చెరువులోకి దిగిపోయి చేపల వేటలో పాల్గొనడం అందరినీ ఆశ్చర్యపరిచింది.
नेता विपक्ष श्री @RahulGandhi ने बेगूसराय में मछली पकड़ने के साथ ही मछुआरा साथियों से बात कर उनके काम से जुड़ी चुनौतियों और संघर्षों पर चर्चा की।
इस दौरान VIP पार्टी के संस्थापक श्री @sonofmallah भी साथ रहे।
महागठबंधन ने वादा किया है 👇
🔹 मछुआरा परिवारों को लीन पीरियड… pic.twitter.com/SFyr4naMbe
— Congress (@INCIndia) November 2, 2025
రాహుల్‌తో పాటు వీఐపీ అధినేత ముఖేష్ సాహ్ని, కాంగ్రెస్ నాయకుడు కన్హయ్య కుమార్ కూడా చెరువులోకి దిగారు. మూడువురు నాయకులు గ్రామస్తులతో మాట్లాడి, వారి సమస్యలు, జీవన విధానాన్ని దగ్గరగా తెలుసుకున్నారు. రాహుల్ గాంధీ సాధారణ ప్రజలతో ఇలా కలవడం చూసి గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేశారు. “ఇలాంటి నాయకుడిని మేము ఇంతకు ముందు చూడలేదు” అంటూ వారు ప్రశంసించారు. ఈ దృశ్యాల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
#WATCH | Bihar: Lok Sabha LoP and Congress MP Rahul Gandhi jumped into a pond and participated in a traditional process of catching fish in Begusarai.
VIP chief and Mahagathbandhan’s Deputy CM face, Mukesh Sahani, Congress leader Kanhaiya Kumar, and others also present. pic.twitter.com/yNPcx2C3bn
— ANI (@ANI) November 2, 2025
ఈ సందర్శన సందర్భంగా మహాకూటమి మత్స్యకారులకు ఇచ్చే హామీలను కూడా ప్రకటించింది:
ఆర్థిక సహాయం: కరువు నెలల్లో మత్స్యకార కుటుంబాలకు రూ.5,000 సహాయం.
ప్రోత్సాహకాలు: మత్స్య బీమా పథకం, ప్రతి ప్రాంతంలో చేపల మార్కెట్లు, శిక్షణ కేంద్రాలు ఏర్పాటు.
ప్రాధాన్యం: సాంప్రదాయ మత్స్యకారులకు చెరువుల కేటాయింపులో ముందస్తు అవకాశం.
Also Read: SSMB29: రాజమౌళితో మూవీపై మహేష్ అదిరిపోయే కౌంటర్
Rahul Gandhi: చెరువులో చేపలు పట్టిన రాహుల్ గాంధీ
