Bus Tragedy: కర్నూలులో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో ఇప్పటివరకు 11 మంది మృతి చెందినట్లు కలెక్టర్ సిరి తెలిపారు. ప్రమాద స్థలాన్ని పరిశీలించిన ఆమె మాట్లాడుతూ, బైక్ బస్సు కిందకు వెళ్లడంతో డోర్ ఓపెన్ అయ్యే కేబుల్ తెగిపోయిందని తెలిపారు. ఈ ఘటనలో 20 మంది ప్రయాణికులు మిస్ అయినప్పటికీ, 20 మంది క్షేమంగా బయటపడ్డారని చెప్పారు. ప్రమాదం అనంతరం డ్రైవర్ పరారయ్యాడు.
ఈ ప్రమాదంలో నెల్లూరు జిల్లాలోని వింజమూరు మండలం గోల్లవారి పాలెంకు చెందిన గోళ్ళ రమేష్ కుటుంబం దురదృష్టవశాత్తు మృత్యువాత పడింది. బెంగళూరులో స్థిరపడిన రమేష్ కుటుంబం హైదరాబాద్ నుంచి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. భార్య, ఇద్దరు పిల్లలు సహా కుటుంబం మొత్తం మరణించడంతో గ్రామంలో విషాదం నెలకొంది.
ఇక రామిరెడ్డి, వేణుగోపాలరెడ్డి, సత్యనారాయణ, శ్రీలక్ష్మి, నవీన్ కుమార్, అఖిల్, జష్మిత, అకీర, రమేష్, జయసూర్య, సుబ్రహ్మణ్యం ప్రమాదం నుంచి బయటపడ్డారు. హిందూపురం వాసి నవీన్ గాయపడిన వారిని తన కారులో కర్నూలు ఆసుపత్రికి తరలించి సహాయపడాడు. అలాగే పుట్టపర్తి నుంచి హైదరాబాదు వెళ్తున్న హైమరెడ్డి బస్సుకు మంటలు అంటుకున్న దృశ్యాలు స్వయంగా వీడియో తీసి పోలీసులకు సమాచారం ఇచ్చింది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
