దొండకాయ కూరినకారం కూర

కావలసినవి :

దొండకాయలు –పావుకిలో (రెండు పక్కల సగం సగం తరగాలి )

సెనగపిండి –నాలుగు టేబుల్ స్పూన్స్

కారం –తగినంత

ఉప్పు –తగినంత

ఇంగువ –ఒకస్పూన్

జీలకర్ర -పావు స్పూన్

తయారి పద్ధతి :ఒక బౌల్ లో సెనగ పిండి ,ఉప్పు ,కారం ,ఇంగువ,జీలకర్ర వేసి కలపాలి .ఈమిశ్రమాన్ని దొండ కాయలలో కూరాలి .ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి వేడయ్యాకనూనె వేసి వేడిచేయాలి.కొంచెం వేడయ్యాక దొండ కాయలు వేసి కలిపి మూత పెట్టాలి.మూటలో నీరు పోయాలి .మూత తీసి చూసేటపుడు కడాయిలో నీరు ఒలక కుండ చూడాలి .పది నిమిషాల తరువాత మూత తీసి కలిపి మరల మూత పెట్టాలి .దొండకాయ ఉడకడానికి సమయం ఎక్కువ కావాలి .కాయవదిలి నట్టు అవుతుంది సర్వింగ్ బౌల్ లోకి తీసి సర్వ్ చెయ్యాలి .

యిది వేడి వేడి అన్నంలోకి బాగుంటుంది .చపాతి లోకి బాగుంటుంది .