mixed vegitable kichidi curry

కావలసిన పదార్దాలు :

బంగాళ దుంపలు  -అరకిలో

బీట్రూట్ తురుము -అర కప్పు

ఉల్లిపాయముక్కలు –అరకప్పు

టమాటముక్కలు -ఒక కప్పు

క్యాబేజికోరు –అరకప్పు

కారేట్ తురుము -ఒక కప్పు

పచ్చిమిర్చి –మూడు

అల్లం -చిన్న ముక్క

కేప్సికం –అరకప్పు  ముక్కలు

వెన్న -ఆరు చెంచాలు

ఉప్పు –సరిపడ

పసుపు –చిటికెడు

తయారు చేసే పద్దతి : బంగాళదుంపలు ఉడికించి తొక్కతీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి .బాండీలో వెన్న వేసి కరిగిన తరువాత పచ్చిమిర్చి ,అల్లం కలిపి నూరిన ముద్ద వేసి వేపాలి .వేగిన తరువాత అన్ని తురుములు వేసి అయిదు నిమిషాలు వేపాలి .ఇపుడు టమాటముక్కలు వేసి అయిదు నిమిషాలు వేపాలి .వేయించిన తర్వాత నీరు పోసి మూతపెట్టి సన్నని మంట మీద ఉడక నివ్వాలి .అయిదు నిమిషాల తరువాత ఆలుగడ్డ ముక్కలు ,సరిపడ ఉప్పు చిటికెడు పసుపు వేసి నీరు ఇగరగానే దింపి సర్వ్ చేయాలి .

సర్వింగ్పద్దతి :రోటి లేదా అన్నంలోకి బాగుంటుంది .