9. స్థూలకాయన్ని తగ్గించే పపయాసాస్‌

 కావలసిన పదార్థాలు :బొప్పాయి పండు ముక్కలు.. ఒక కేజీపంచదార.. పావు కేజీసోడియం బెన్‌టోజ్.. ఒక టీ.సిట్రిక్ యాసిడ్.. ఒక టీ.గరంమసాలా.. 5 గ్రా.లవంగాలు, మిరియాలు, దాల్చిన చెక్క, ఉప్ప.. తగినంత తయారీ విధానం :ఓ మోస్తరుగా పండిన బొప్పాయి పండును తీసుకుని చెక్కుతీసి ముక్కలుగా కోసి, ఒక పాత్రలో వేసి వేడిచేయాలి. తరువాత వాటిని గుజ్జుగా చేసి ఓ పల్చటి వస్త్రంలోపోసి వడబోయాలి. ఒక గిన్నెలో సగం పంచదారను తీసుకుని, దాంట్లో కాసిన్ని నీళ్లుపోసి బాగా మరిగించాలి. లవంగాలు, మిరియాలు, దాల్చిన చెక్కలను దంచి ఈ పొడిని పంచదార పాకంలో వేయాలి. అలాగే గరంమసాలా పొడిని కూడా వేసి కలియబెట్టాలి.ఈ మిశ్రమం బాగా చిక్కబడిన తరువాత దించి తగినంత ఉప్పు, సోడియం బెన్‌టోజ్, సిట్రిక్ యాసిడ్, మిగిలిన పంచదారనును వేసి బాగా కలియబెట్టి, మరిగించాలి. తరువాత దించి చల్లార్చి గాజు సీసాలో భద్రపరచుకోవాలి. అంతే పపయా సాస్ రెడీ. వారం రోజులదాకా నిల్వ ఉండే ఈసాస్‌ను బ్రెడ్‌తో కలిపి తినవచ్చు. ఇందులో చక్కెర శాతం తక్కువ కనుక, కొందరికి రుచించదు. కానీ మధుమేహ వ్యాధిగ్రస్తులకూ, ఆదర్శభోజనం తీసుకునే వారికీ, స్థూలకాయులకూ Read More …

BANANA STEM CURRY

కావలసిన పదార్దములు:బనానా స్టెం  (అరటి దవ్వ/దూట )సెనగపప్పు ఒక స్పూన్మినప పప్పు అర స్పూన్ఆవాలు అర స్పూన్ఎండుమిర్చి రెండు (ముక్కలు గా  చెయ్యాలి)కరివేపాకు ఒక రెమ్మఉప్పు తగినంతకొంచం చింతపండు గుజ్జునూనె ఒక స్పూన్అర స్పూన్ ఆవాలు  నూ రిన ముద్దకొంచెం ఇంగువతయారుచేసే విధానంఅరటి దవ్వ ని చిన్న చిన్న ముక్కలుగా తరిగి, కొంచం పసుపు, ఒక స్పూన్ పెరుగు కలిపిన నీళ్ళలో ఉడికించాలి. నీళ్ళను వంచేసి, ముక్కలు కొంచం పిడుచుకొని ప్రక్కన పెట్టుకోవాలి. మూకుడు లో ఒక స్పూన్ నునే వేసి అందులో సెనగ పప్పు, మినప పప్పు, ఆవాలు, ఎండుమిర్చి ముక్కలు, ఇంగువ వేసి వేయించాలి. పోపువేగాక ఉడికించిన  ముక్కలు, కరివేపాకు, చింతపండు గుజ్జు, ఉప్పు వేసి రెండు మూడు నిముషాలు ముక్కలకి పులుపు బాగా అంటేలా కలపాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఆవాల  పేస్టు కలిపాలి. ఒకటి రెండు గంటలు తర్వాత బాగా ఊరుతుంది కాబట్టి టేస్టు బాగుంటుంది. బనానా స్టెం లో ఫైబర్ ఉంటుంది కాబట్టి ఆరోగ్యానికి చాల మంచిది. నూనె  కూడా తక్కువ పడుతుంది కాబట్టి బరువు తగ్గాలనుకునే  వారికీ బాగుంటుంది.