కావలసిన పదార్దములు:
బనానా స్టెం (అరటి దవ్వ/దూట )
సెనగపప్పు ఒక స్పూన్
మినప పప్పు అర స్పూన్
ఆవాలు అర స్పూన్
ఎండుమిర్చి రెండు (ముక్కలు గా చెయ్యాలి)
కరివేపాకు ఒక రెమ్మ
ఉప్పు తగినంత
కొంచం చింతపండు గుజ్జు
నూనె ఒక స్పూన్
అర స్పూన్ ఆవాలు నూ రిన ముద్ద
కొంచెం ఇంగువ
తయారుచేసే విధానం
అరటి దవ్వ ని చిన్న చిన్న ముక్కలుగా తరిగి, కొంచం పసుపు, ఒక స్పూన్ పెరుగు కలిపిన నీళ్ళలో ఉడికించాలి. నీళ్ళను వంచేసి, ముక్కలు కొంచం పిడుచుకొని ప్రక్కన పెట్టుకోవాలి. మూకుడు లో ఒక స్పూన్ నునే వేసి అందులో సెనగ పప్పు, మినప పప్పు, ఆవాలు, ఎండుమిర్చి ముక్కలు, ఇంగువ వేసి వేయించాలి. పోపువేగాక ఉడికించిన ముక్కలు, కరివేపాకు, చింతపండు గుజ్జు, ఉప్పు వేసి రెండు మూడు నిముషాలు ముక్కలకి పులుపు బాగా అంటేలా కలపాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఆవాల పేస్టు కలిపాలి. ఒకటి రెండు గంటలు తర్వాత బాగా ఊరుతుంది కాబట్టి టేస్టు బాగుంటుంది.
బనానా స్టెం లో ఫైబర్ ఉంటుంది కాబట్టి ఆరోగ్యానికి చాల మంచిది. నూనె కూడా తక్కువ పడుతుంది కాబట్టి బరువు తగ్గాలనుకునే వారికీ బాగుంటుంది.
Originally posted 2009-10-20 14:10:00.
Lovely… I used to eat this a lot when I was kid. Mee blog ni telugu blogs lo attach cheyyandi.
Thanks
Rajesh
Thanks Rajesh. akkada ela add cheyyalo konchem cheptara please