23. అరటి కాయ పచ్చడి (కాల్చిన):

కావలసిన పదార్థములు:
అరటి కాయ     ఒకటి
ఎండుమిరప కాయలు ౫
 సెనగపప్పు     1 టీ స్పూన్
మినప పప్పు  ఒక టీ స్పూన్
 ఆవాలు     అర టీ స్పూన్
ఇంగువ    కొంచం
ఉప్పు, చింతపండు, బెల్లం
తాయారు చేసే పద్ధతి

 అరటికాయని గాస్ స్టవ్ చిన్న ఫ్లేం మిద నెమ్మదిగా కాల్చాలి. అరటికాయ మరీ ముదురుగా ఉండ కూడదు.  ఎందు మిర్చి, సెనగ పప్పు, మినపపప్పు, ఆవాలు, ఇంగువ పోపు వేయించి పొడి కొట్టుకోవాలి. ఈ పచ్చడి మిక్సీ లో కంటే చిన్న రోతిగుంటలో చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే పోపు మరి మెత్తగా కాకుండా బరకగా దంచుకుంటే పచ్చడి మధ్యలో కరకర లాడుతూ రుచిగా ఉంటుంది.  అరటికాయని వలిచి పోపు తో కలిపి కొంచం చింతపండు, ఉప్పు, బెల్లం కలిపి నూరాలి.  చాల రుచి గా ఉండే అరటికాయ కాల్చిన పచ్చడి రెడీ.