12. అరటికాయ వడలు:

అరటికాయ వడలు అనేటప్పడికి అమ్మో ఆయిలీ! అని భయపడక్కర్లేదు. తవ్వమీద కొంచం ఆయిల్ వేసుకొని కాల్చుకోవచ్చు.
కావలసిన పదార్ధాలు:
అరటికాయలు 2 ,
పచ్చి  మిర్చి  2(సన్నగా తరిగినవి)
కొత్తిమీర ఒక కట్ట (సన్నగా తరిగినది)
ఉప్పు (తగినంత),
సెనగపిండి రెండు టీ స్పూన్లు.

అరటికాయలు చెక్కు తీసి, మీడియం సైజు ముక్కలుగా కోసి నీళ్ళలో ఉడికించు కోవాలి.  కుక్కర్లో పెడితే మరీ పేస్టూ లాగా అయ్యి బాగుండదు.  బయట స్టవ్ మీద గిన్నెలో నీళ్ళు పెట్టి సరిపడా ఉదాకించాలి.  చల్లారాక ఉప్పు, సెనగపిండి, సన్నగా తరిగిన మిర్చి, కొత్తిమీర కలిపి వడ లాగా తట్టుకోవాలి.  వీటిని తవ్వ మీద టిక్కిలలాగా  సన్నటి ఫ్లేం మీద కాల్చు కోవాలి.  కొంచం మిర్చి ఎక్కువ వేసుకుంటే అన్నం లోకి, తక్కువ వేసుకుంటే స్నాక్ గాను బాగుంటాయి.