బీరపోట్టు పచ్చడి

కావలసినవి :

బీరతోక్కలు -మూడు కాయలవి

చింతపండు-పులుపుకు తగినంత

ఎండుమిర్చి –అయిదు

ఉప్పు –తగినంత

ఆయిల్ -వేపడానికి సరిపడ

వెల్లుల్లి రెబ్బలు –అయిదు

మినపపప్పు –ఒకస్పూన్

జీలకర్ర –ఒకస్పూన్

తయారీ పద్దతి :స్టవ్ మీద కడాయి పెట్టి వేడి అయినాక ఆయిల్ వేసి వేడి చేయాలి .బీర పొట్టు వేసి బ్రౌన్ కలర్ కి వచ్చేదాకా వేయించాలి .దీనిని పక్కన పెట్టాలి .కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసి మినపపప్పు ,జీలకర్ర ,ఎండుమిర్చి వేసి వేయించాలి .యిపుడు బీరపోట్టు ,ఎండుమిర్చి ,చింతపండు ,ఉప్పు ,వెల్లుల్లి రెబ్బలు వేసి కొంచెం నీరు పోసి మెత్తగా గ్రైండ్ చేయాలి .యిందులోమినపప్పు ,జీలకర్ర వేసి కలపాలి .సర్వింగ్ బౌల్ లోకి తీసి సర్వ్ చేయాలి .యిది వేడి వేడి అన్నంలోకి బాగుంటుంది .