బీరకాయ పోపు కూర

కావలసిన పదార్ధాలు:
బీరకాయలు -ఒక కిలో(తొక్క తీసి సన్నగా తరిగి పక్కన పెట్టాలి )
వెల్లులి పాయలు –రెండు
పచ్చిమిర్చి –రెండు
మినప పప్పు -ఒక స్పూన్
జీలకర్ర—ఒకస్పూన్
ఆవాలు-పావుస్పూన్
కరివేపాకు –రెండురేమ్మలు
ఆయిల్ -రెండు స్పూన్స్
ఉప్పు -తగినంత

తయారి పద్దతి:
స్టవ్ మీద కడాయిపెట్టివేడి చేయాలి.
ఆయిల్ వేసి వేడి చేయాలి.
ఆయిల్ వేడెక్కిన తరువాత వెల్లులి పాయలు వేసి వేపాలి తరువాత మినపపప్పు ,ఆవాలు ,జీలకర్ర,కరివేపాకు ,పచ్చిమిర్చివేసి వేయించాలి.
అందులో బీర కయ ముక్కలు వేసి కలిపి మూత పెట్టాలి .
అయిదు నిమిషాల తరువాత మూత తీసి ముక్క మెత్తబడితే అందులో తగినంత ఉప్పు వేసి కలిపి హై ఫ్లెం మీద నీరు యిమ్కనివ్వాలి.
దీనిని సర్వింగ్ బౌల్ లోకి తీసి సర్వ్ చేయాలి .
యిది వేడివేడి అన్నంలోకి,వేడి చపాతీ లోకి బాగుంటుంది.

Leave a Reply