బీరకాయ పోపుకారం కూర

కావలసినవి :

బీరకాయలు –ఒకకిలో (పొట్టు తీసి సన్నగా తరగాలి )

మినపపప్పు –నాలుగుస్పూన్స్

శెనగపప్పు-నాలుగు స్పూన్స్

ధనియాలు -నాలుగు స్పూన్స్

ఎండు మిరపకాయలు –ఆరు

ఆయిల్ –తగినంత

ఉప్పు –తగినంత

తయారిపదతి:స్టవ్ మీద కడాయి పెట్టి వేడెక్కిన తరువాత ఆయిల్ వేయాలి .శెనగపప్పు ,మినపపప్పు ,ధనియాలు ,ఎండు మిరపకాయలు ,వేసి వేయించాలి .వేగాక దాన్ని చల్లారనివ్వాలి.తరువాత దీని పౌడర్ చేయాలి .పౌడర్ లో ఉప్పుకూడా వేయాలి. స్టవ్ మీద కడాయి పెట్టి వేడెక్కిన తరువాత ఆయిల్ వేయాలి .బీరకాయ ముక్కలు వేసి మూత పెట్టాలి .అయిదు నిమిషాల తరువాత మూత తీసి చూసి ముక్కలు మెత్తగా అయ్యాక ముందుగా తయారు చేసిన పొడి చల్లి కలిపి దించేయాలి .బీరకాయ కారం కూర రెడీ .దీనిని వేడి వేడి అన్నం లోకి బాగుంటుంది .చపాతీ లోకి కూడా బాగుంటుంది.

Originally posted 2011-03-21 07:25:00.