కొత్తిమీర దోస

కావలసిన పద్దార్దాలు:

మైదా పిండి -ఒక కప్పు

వరిపిండి -ఒక కప్పు

సెనగ పిండి -పావు కప్పు

రవ్వ -ఒక కప్పు

అల్లం -చిన్న ముక్క

పచ్చిమిర్చి –మూడు

కొత్తిమీర-అఫ్ కట్ట (కాడలు తీసి ఇసుక లేకుండా కడిగి పక్కన పెట్టాలి .)

సాల్ట్ -రుచికి సరిపడ

తయారీ పద్దతి :మైదా పిండి ,సెనగపిండి ,వరిపిండి ,రవ్వ సాల్ట్ వేసి నీరు పోసి దోసల పిండిలా కలపాలి .అల్లం ,పచ్చిమిర్చి ,కొత్తిమీర కలిపి మిక్సి లో వేసి మెత్తగా రుబ్బాలి .ఈ పేస్ట్ని పిండిలో వేసి బాగా కలపాలి .వేడి వేడి పెనం మీద దోసలాగా కాల్చు కోవాలి .అంతే కొత్తిమీర దోస రెడి .

సర్వింగ్ పద్దతి :ఇవి వేడి వేడిగా తింటే బాగుంటాయి .నచ్చితే కొబ్బరిచట్నీ తో తినొచ్చు .లేక పొతే వుట్టివి కూడా బాగుంటాయ్.

Leave a Reply