ఆనపకాయ పోపుకూర

కావలసినవి:
ఆనపకాయ –ఒకటి
పచ్చిమిర్చి-ఒకటి
మినపపప్పు -ఒక స్పూన్
సెనగపప్పు –ఒకస్పూన్
ఆవాలు -పావు స్పూన్
జీలకర్ర-పావుస్పూన్
కరివేపాకు –ఒకరెమ్మ
ఉప్పు –తగినంత
ఆయిల్ -టూస్పూన్స్
తయారీ విధానం:
స్టవ్ మీద కడాయి పెట్టి వేడెక్కాక ఆయిల్ వేయాలి .
మినపపప్పు ,సెనగపప్పు,ఆవాలు, జీలకర్ర,కరివేపాకు,పచ్చిమిర్చి,వేసి వేయించాలి. తరువాత ఆనపకాయ ముక్కలు వేయాలి .
కొంచెం నీరు పోసి మూతపెట్టాలి.
 అయిదు నిమిషాల తరువాత మూత తేసి చూడాలి ముక్క ఉడికాక కొంచెం ఉప్పు వేసి కలిపి స్టవ్ హైలో పెట్టి నీరు యింకనివాలి.
ఆనపకాయ పోపు కూర తయారు.
ఇది వేడి వేడి అన్నం లోకి బాగుంటుంది.
చపతిలోకి కూడా బాగుంటుంది.